- సీనియర్ న్యాయవాది లక్ష్మణ్ రావు
బతుకమ్మ, బిచ్కుంద : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారని బిచ్కుంద సీనియర్ న్యాయవాది లక్ష్మణ్ రావు అన్నారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించిందని ఈ సందర్భంగా పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతారని అలాగే ఈ రోజున జాతీయ న్యాయ దినోత్సవం (నేషనల్ లా డే) అని కూడా పిలుస్తారని ఆయన అన్నారు. భారత న్యాయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగంలో న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పొందుపరచబడ్డాయి. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించేలా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత సూత్రాలను పటిష్టం చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ చేసిన కృషిని స్మరించుకునేందుకు ఉపయోగపడుతుంది. పౌరులు తమ పౌర బాధ్యతలను,రాజ్యాంగం అందించిన హక్కులను గుర్తించేందుకు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది. అని ఆయన తెలియజేశారు. ఈ దినోత్సవం నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారని అన్నారు.
