29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల :  ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో ముఖ్యమని ఎస్బిఐ ఏర్గట్ల శాఖ మేనేజర్ షేక్ కరీముల్లా ఉద్ఘాటించారు. ఏర్గట్ల లోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులను వివరించారు. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్సూరెన్స్ ప్రాధాన్యతపై శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీకి డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ.. భవిష్యత్తుపై భరోసా కోసం ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ, లోన్ యాప్ ల వాడకం, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఎదురవుతున్న సైబర్ సమస్యలపై అవగాహన సదస్సులో వక్తలు ప్రసంగించారు. పెట్రోల్ బంకులో 500 రూపాయల జీతానికి పనిచేసిన ధీరుభాయ్ అంబానీ ఆర్థిక క్రమశిక్షణతో కుబేరుడుగా ఎదిగిన విషయాన్ని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి మాట్లాడుతూ డబ్బు విలువ తెలుసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఆ స్థాయికి ఎదిగొచ్చని స్ఫూర్తినింపారు. ఆన్లైన్ గేమ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు సంపాదించుకున్న డబ్బులు ఫైబర్ మోసానికి గురవకుండ జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ఎల్ఐసి డీజీఎం సురేష్ కు ప్రధానోపాధ్యాయులు, పాఠశాల బృందం సన్మానం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా గత వారం నుంచి నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

More articles

Latest article