ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి
ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేందలోని ఇందల్వాయి, వివిధ గ్రామాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలు యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ నాయకులు లోకల్ గోపి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరంలో సాయుధ పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు - అది మనంతట మనమే తీసుకోవాలని చెప్పిన ఆ నేతాజీ అడుగుజాడల్లో అందరు నడుచుకొని భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని...