24 C
Hyderabad
Sunday, August 2, 2026

హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఇందుకోసం  1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని ఈ నెల 12న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని అన్నారు.  ఇందుకోసం నిజామాబాద్ ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి , ములుగు , మహబూబాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది, టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వాహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు దారి పోడువున ” సి.సి కెమెరాలు , డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు, బైనాక్యూలేర్లతో పర్యవేక్షణ, పాత నేరస్థులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతీ ఒక్కరు అన్ని రకాల జాగ్రత్తలు వహించాలని, శోభాయాత్ర సందర్భంగా అవసరమైనజాగ్రత్తలు వహించాలని , శోభాయాత్ర ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహాకులు, భక్తులు యాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకుంటు పోలీసులకు సహాకరించాలని కోరారు. శనివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.

హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వెల్లు బస్సులు: ఆర్ఠీసీ బస్ స్టాండ్, జడ్పీ “టీ” రోడ్, నిర్మల హృదయ స్కూల్ ముందు నుండి అంబెడ్కర్ కాలనీ, దుబ్బ రోడ్, గిరిరాజ్ కాలనీ నుండి బైపాస్ రోడ్డు చేరుకోవాలి. బోధన్ నుండి వచ్చి పోయే వాహనాలు:- అర్సపల్లి రైల్వే గేట్ నుండి కొత్త కలక్టరేట్, కాంటేశ్వర్ బై పాస్, కాంటేశ్వర్ టెంపుల్ “టి” జంక్షన్, ఎన్టీఆర్ చౌరాస్తా, ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకోవాలి. బాన్స్ వాడ నుండి వచ్చి పోయే వాహనాలు:- వర్ని చౌరాస్తా నుండి పులాంగ్ సర్కిల్, కోర్ట్ సర్కిల్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్సు స్టాండ్ చేరుకోవాలి. నిజామాబాద్ డివిజన్ మొత్తం సిబ్బంది పోలీస్ కమీషనర్, అదనపు పోలీస్ కమీషనర్లు , ఎ.సి.పిలు, సి.ఐ లు, ఎస్.ఐ లు. ఎ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుల్స్ , కానిస్టేబుల్స్ , మహిళా కానిస్టేబుల్స్ , స్పెషల్ పార్టీలు / ఇతర సిబ్బంది దాదాపు 1300 మంది బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

More articles

Latest article