. . . అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో వినతి
బాన్సువాడ, బతుకమ్మ :
హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరుతూ మంగళవారం అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో అధికారిని వసంతకు వినతి పత్రాన్ని అందజేశారు. అన్ని గ్రామాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కలిసి జరుపుకునే అతిపెద్ద హిందువుల పండుగ హనుమాన్ జయంతి అని అలాంటి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు రోజుగా ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో వసంత సానుకూలంగా స్పందిస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం గురుస్వాములు అంబిలిపూర్ రాజు స్వామి, పాలకుర్తి దత్తు స్వామి, తేలి మహేష్ కుమార్ స్వామి, కల్లేటి వెంకటరమణ స్వామి, దాసరి సతీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
