30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా హనుమాన్ జయంతోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

  •  కిక్కిరిసిన ఆలయాలు

 

 బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం, నడి ఊరు హనుమాన్ మందిరం, కొండెంగ హనుమాన్ మందిరం, నిఖిల్ దాం తదితర హనుమాన్ మందిరాలలో శనివారం రోజున హనుమాన్ జయంతోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయాలను పుష్పాలతో మామిడి ఆకులతో విద్యుత్ దీపాలతో తోరణాలతో అందంగా అలంకరించారు. ప్రాతః కాలం నుండి స్వామి వారికి పంచామృత, సింధూర, మంత్రపుష్ప పత్ర అభిషేకాలు, అర్చనలు, మంగళ నీరాజనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మారుతి మందిరంలో గౌరీ గణపతి, నవగ్రహ ఆరాధన, శ్రీ రామనామ హోమం, పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. భక్తులు ఉదయం నుండే ఆలయాలకు విచ్చేసి స్వామివారినీ దర్శించుకోనీ తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కొరకై అన్ని ఆలయాల వద్ద అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల ప్రధానార్చకులు ప్రవీణ్ మహారాజ్, ఉదయ్ శర్మ, పట్టణ సీఐ వెంకట్ నారాయణ, బోధన్ విడిసి చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, ఆలయాల కార్యనిర్వాహణాధికారి రాములు, శివాలయ మారుతి ఆలయ చైర్మన్లు హరికాంత్ చారి, గుండేడి శంకర్, శివాలయ మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్ బుజ్జి, నిఖిల్ దాం సంస్థ సభ్యులు సాయా గౌడ్, వీడీసీ, శివాలయ, మారుతి ఆలయాల కమిటీల సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు తదితరులు ఆలయానికి విచ్చేశారు. అలాగే ఉత్సవమూర్తుల ఊరేగింపు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం మారుతీ మందిరం  నుండి వీర హనుమాన్ విజయయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ తిరిగి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్మస్థలి వరకు కొనసాగుతుందని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

More articles

Latest article