ఘనంగా హనుమాన్ జయంతోత్సవాలు
కిక్కిరిసిన ఆలయాలు బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం, నడి ఊరు హనుమాన్ మందిరం, కొండెంగ హనుమాన్ మందిరం, నిఖిల్ దాం తదితర హనుమాన్ మందిరాలలో శనివారం రోజున హనుమాన్ జయంతోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయాలను పుష్పాలతో మామిడి ఆకులతో విద్యుత్ దీపాలతో తోరణాలతో అందంగా అలంకరించారు. ప్రాతః కాలం నుండి స్వామి వారికి పంచామృత, సింధూర, మంత్రపుష్ప పత్ర అభిషేకాలు, అర్చనలు, మంగళ నీరాజనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మారుతి మందిరంలో గౌరీ గణపతి, నవగ్రహ...