24 C
Hyderabad
Sunday, August 2, 2026

మోకాళ్లపై కూర్చొని హమాలీ కార్మికుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో  నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం మోకాళ్లపై కూర్చొని హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీలు రాష్ట్ర కమిషన్తో కుదిరిన రేట్ల ఒప్పంద జీవోను విడుదల చేయాలన్నారు. క్వింటాకు 26 రూపాయల నుండి 29 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు స్వీపర్ల 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై అమలు యూనియన్ బోధన్ పట్టణ ముఖం వెంకటేష్,  పవన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శంకర్ సుదర్శన్ సాయిలు పోశెట్టి లక్ష్మణ్ దేవయ్య మాణిక్యం సాయి కృష్ణ రవికుమార్ రాజు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article