నిజామాబాద్, బతుకమ్మ : గులాబ్ జామ్ లో వెంట్రుకలు రావడంతో కస్టమర్ కంగుతిన్నాడు. నిజామాబాద్ లోని ఢిల్లీవాలా స్వీట్ హోమ్స్ లో ఓ కస్టమర్ గులాబ్ జామ్ ఆర్డర్ ఇచ్చాడు. రూ.130 ఆన్ లైన్ పేమెంట్ చేసి ఇంటికి వెళ్లి స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేయగా, గులాబ్ జామ్ లో వెంట్రుకలు చూసి సదరు కస్టమయర్ షాక్ అయ్యాడు. ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్వీట్ షాపులో తనిఖీలు చేసి, యజమానికి నోటీసులు అందించారు.