బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రములో రెండ్ల ముదిరాజ్ శ్రీ బాల రాజా రాజేశ్వర స్వామి నూతన ఆలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి ఆలయానికి ప్రభుత్వం దేవదాయశాఖ తరపున 40 లక్షలు, చిన్న రెండ్ల వారి సంఘం,పెద్ద రెండ్ల వారి సంఘం రెండు సంఘాలు సభ్యులు కలిపి 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కాంటిబ్యూషన్ కట్టడముతో మొత్తం 50 లక్షల ప్రభుత్వము అంచనాలతో దేవాదాయ ప్లాన్ ప్రకారం పనులు జరుగుతాయి. దీనికి టెండర్ నిజామాబాద్ శంకర్ అనే వ్యక్తికి వచ్చిందని తెలిపారు.మేము వెళ్లి కలువగానే టెండర్ అయ్యే విధముగా ఆర్ధిక మంజూరు ప్లాన్ అప్రూవల్ ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, కు సహకరించిన శివన్నోల్ల శివకుమార్ కి రెండ్ల సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మెన్ రేండ్ల చిన్నయ్య తెలిపారు.ఇట్టి కార్యక్రమములో సంఘాల పెద్ద మనుషులు ఇబ్రహీంపట్నం నర్సయ్య,దొబ్బల పెద్ద కిషన్, ఆలయ కమిటీ సభ్యులు రొక్కెడ చిన్న సాయన్న, దొబ్బల రాజేష్ బొర్రి,రెండ్ల రవి ,ఇబ్రహీంపట్నం నర్సయ్య , జక్కని శ్రీనివాస్,గుండాల పెద్ద ముత్తెన్న,రెండ్ల రాజన్న,జక్కని మోహన్ , ఏర్గట్ల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి,చిన్న రెండ్ల,పెద్ద రెండ్ల రెండు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
