24 C
Hyderabad
Sunday, August 2, 2026

కిరాణా వ్యాపారికి జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రాత్రి వేళ కిరాణా దుకాణం తెరిచి ఉంచిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించిందని రెండో టౌన్ ఎస్ హెచ్ వో యాసీర్ అరాఫత్ తెలిపారు. షేక్ జుబేర్ అనే వ్యక్తి రాత్రి కిరాణా దుకాణం తెరిచి ఉంచడంతో అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చామన్నారు.

కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి  కిరాణా దుకాణం యజమాని జుబేర్ కు నాలుగు రోజుల జైలు శిక్ష విధించిందన్నారు. వ్యాపారులు తమ దుకాణాలను నిర్ణీత సమయంలోగా మూసివేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని యాసీర్ అరాఫత్ స్పష్టం చేశారు.

More articles

Latest article