ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో స్పోర్ట్స్ యూత్ క్లబ్ యువకుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండగను పురస్కరించుకొని రామాలయ మందిరం వద్ద ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలునిర్వహించి మహా అన్నదానం నిర్వహించారు. అనంతరం వినాయకునికి పూలమాలలు వేసి నైవేద్యాన్ని సమర్పించారు.గ్రామంలోనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో అందరు బాగుండాలని కోరారు.అలాగే వీధి వీధిలో వాడవాడలో వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ యూత్ క్లబ్ యువకులు మారంపల్లి సుధాకర్ ఎల్ గంగారం, శ్రీనివాస్ గౌడ్,భూమయ్య,శ్రీకాంత్,భవిష్, కన్నయ్య గౌడ్,తేలు కృష్ణమూర్తి, దాసు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.