ముదిరాజ్ సంఘానికి నిధులు మంజూరు

0 1,140

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల గ్రామములో చిన్న రేండ్ల ముదిరాజ్ సంఘానికి ఎస్ డి ఎఫ్ గ్రాంట్ క్రింద రూ.5 లక్షలు,  గుండాల ముదిరాజ్ సంఘానికి 2 లక్షల50 వేల రూపాయల అదనపు గదుల నిర్మాణానికి గురువారం  భూమి పూజ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ అడిగిన వెంటనే నిధులు ఇప్పించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ఇబ్రహీంపట్నం పెద్ద గంగాధర్ ,డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి, బద్దం లింగారెడ్డి,సున్నపు లింగన్న, మేకల సాయన్న, చిన్న రేండ్ల ముదిరాజ్ సంఘ సభ్యులు, గుండాల వారి ముదిరాజ్ సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.