ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో సోమవారం గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థుల నాయనమ్మ, అమ్మమ్మలు రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకువచ్చి ప్రదర్శనలో ఉంచారు. అంతేకాక వారి మనమలు ,మనవరాండ్లతో కలసి నృత్య ప్రదర్శనలో పాల్గొని, చూపరులను ఆకట్టుకున్నారు. అలాగే గ్రాండ్ పేరెంట్స్ గా విచ్చేసిన వారు తమ విద్యార్థి దశలోని అనుభవాలతోపాటు, విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను సభావంగా వివరించారు. ఎస్ఎస్ఆర్ పాఠశాల ఎండి మారయ్య గౌడ్, సీఈవో హరిత...