30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పేకాట ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నగరంలోని విఠలేశ్వర్ నగర్ లో గల రైస్ మిల్ పక్కన పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారమేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది దాడి చేశారని తెలిపారు. ఈదాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని మూడు సెల్ ఫోన్లు, రూ.2450 నగదు, మూడు ద్వి చక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.

More articles

Latest article