నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా చేనేత సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికైన సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్‌నగర్ కార్యవర్గ సభ్యురాలు గుజ్జ రాజేశ్వరిని ఫోరం సభ్యులు ఘనంగా సన్మానించారు. సుభాష్‌నగర్‌లోని సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనంలో మంగళవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఫోరం అధ్యక్షులు కాటిపల్లి నారాయణరెడ్డి శాలువాతో సత్కరించగా, కార్యదర్శి డా. వంగ విజయకుమార్ బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యులు మాట్లాడుతూ, చేనేత సహకార సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం గర్వకారణమని, ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సీనియర్ సిటిజన్స్ ఫోరంకు గతంలో అందించిన సేవలను కొనసాగిస్తూ, భవిష్యత్తులోనూ ఫోరం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తనను సన్మానించిన ఫోరం సభ్యులకు గుజ్జ రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ ఫోరంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు టి. భూమన్న, నల్లా రాజారెడ్డి, దొంతి లక్ష్మారెడ్డి, కర్ణం వెంకటరెడ్డి, శ్రీరాములు, లింగయ్య, భూమయ్య, రవీంద్రనాథ్, గుజరాతీ రాజేశ్వర్, రంగయ్య, సిద్దిరాములు, సత్యనారాయణ, సభ్యులు రాజన్న తదితరులు పాల్గొని రాజేశ్వరికి అభినందనలు తెలిపారు.
