ఘనంగా మహా లక్ష్మీ బోనాల పండుగ

0 9,877

 

నవీపేట్, బతుకమ్మ :

 

నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహలక్ష్మీ అమ్మ వారికి బోనాల పండుగ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మీ అమ్మవారికి కడాలతో డప్పు బాజాలతో, ఊరేగింపుగా అమ్మ వారిని కొలుస్తు, పోతరాజుల విన్యాసాలతో ప్రజలందరిని ఆకట్టుకుంటు, గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు గా బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మీ బోనాల పండుగ కార్యక్రమానికి తనని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Grand Celebration of the Maha Lakshmi Bonalu Festival

 

ఆ అమ్మవారి దీవేనలు నాళేశ్వర్ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల మీద ఉండాలని, వర్షాలు పుష్కలంగా పడి పంటలు బాగా పండాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నామన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి నాళేశ్వర్ గ్రామంలో ఆషాడ మాసంలో మహలక్ష్మీ బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా మున్నూరు కాపు సంఘ భవనం నుండి గ్రామాభివృద్ది కమిటి సంఘ భవనం వరకు అగరంగా వైభవంగా ఊరేగింపు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ మహలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు నాళేశ్వర్ ప్రజలందరిపై ఉండాలని, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని అమ్మ వారికి మొక్కు కోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, సొసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, కమిటి సభ్యులు సురేష్, రాజేశ్వర్, బోజరాం, గంగాదర్ మున్నూరు కాపు సభ్యులు సుదర్శన్, బోజారం, శ్రీకాంత్, పోశేట్టి, గంగాధర్, గణేష్, బోజన్న, శేఖర్, గ్రామస్థులు పోశేట్టి, బోజన్న, దేవన్న, ప్రవిణ్, నర్సింగ్ రావు, కిషాన్, సంజీవ్, భూమయ్య, రాజేశ్వర్, రమేష్ తదితరులు మహిళలు పాల్గొన్నారు.

 

Grand Celebration of the Maha Lakshmi Bonalu Festival

Leave A Reply

Your email address will not be published.