26 C
Hyderabad

ఘనంగా బోనాల వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

దేవుని పల్లి, బతుకమ్మ :

 

దేవునిపల్లి పట్టణంలోని 10వ వార్డు సీతారామ్ నగర్ కాలనీలో ముత్యాల పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు లచ్చయ్య పటేల్, కార్యదర్శి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలనీ సభ్యులు విష్ణు, రమేష్, వడ్ల రాములు, తిరుపతి, నరేష్, శ్రీనివాస్, రవీందర్ రావు, కిషన్ రావు, కృష్ణ స్వామి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

 

Grand Bonalu celebrations

More articles

Latest article