ఘనంగా బోనాల వేడుకలు

  దేవుని పల్లి, బతుకమ్మ :   దేవునిపల్లి పట్టణంలోని 10వ వార్డు సీతారామ్ నగర్ కాలనీలో ముత్యాల పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు లచ్చయ్య పటేల్, కార్యదర్శి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలనీ సభ్యులు విష్ణు, రమేష్, వడ్ల రాములు, తిరుపతి, నరేష్, శ్రీనివాస్, రవీందర్ రావు, కిషన్ రావు, కృష్ణ స్వామి తదితరులు...