28.2 C
Hyderabad

నిర్మల హృదయ హై స్కూల్‌లో ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నగరంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ హై స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, క్రమశిక్షణ, ఉత్సాహం, వైభవంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్ సీసీ అధికారి జనరల్ కల్నాల్ ప్రేమ్ జిత్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ డా.సిస్టర్ నిర్మల, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ సరిత సింగారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ సిస్టర్, తెలుగు మీడియం ఇంచార్జి రెవరెండ్ సిస్టర్ సుందరిలు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన అద్భుతమైన మార్చ్ ఫాస్ట్ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వివిధ హౌస్‌లకు చెందిన విద్యార్థులు పూర్తి క్రమశిక్షణతో, సమన్వయంతో, ఉత్సాహంతో, దేశభక్తి భావంతో మార్చ్  ఫాస్ట్ లో  పాల్గొన్నారు. ముఖ్య అతిథి కల్నాల్ ప్రేమ్ జిత్ ప్రసంగిస్తూ విద్యార్థులే దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి, నైతిక విలువలు, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ప్రతిభను దేశ ప్రగతికి వినియోగించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మన దేశం మన గర్వం మన బాధ్యత మన భవిష్యత్తుఅనే స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి, భారతీయ సంస్కృతి , జాతీయ ఐక్యతను అద్భుతంగా ప్రతిబింబించాయి. విద్యార్థుల దేశభక్తి గీతాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులు, అతిథులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

More articles

Latest article