27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కాంటా ప్రారంభించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ జన సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి శనివారం అడిషనల్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి 25 రోజులు కావస్తోందని, కాంటా ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే టార్పాలిన్ లు అందజేయడంతోపాటు హమాలీలకు కూలిని ప్రభుత్వమే చెల్లించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జెడల రజినీకాంత్, జిల్లా నాయకులు నీల నాగరాజు, పుల్లూరి పోచయ్యలు తదితరులున్నారు.

 

More articles

Latest article