ధాన్యం కాంటా ప్రారంభించాలి
కామారెడ్డి, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ జన సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి శనివారం అడిషనల్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి 25 రోజులు కావస్తోందని, కాంటా ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే...