24 C
Hyderabad
Sunday, August 2, 2026

క్రమంగా పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాను శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహంగా రావడంతో ప్రాజెక్టులు నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం  ఎస్సారెస్పీ లోకి 15270 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 28.128 టిఎంసిల నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్ట్ ఏఈఈ రవి తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరగడంతో జలకళ సంతరించుకుంటుంది. దీంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా బుధవారం 1077.20 అడుగులు 37.891 టిఎంసిల నీరు ఉంది.

More articles

Latest article