- ప్రజా సేవకుడు,ప్రజా నాయకుడు
- జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగగిరిధర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్న జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో ఆలయంలో ఆయన పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్చన చేయించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో అర్చనా కార్యక్రమాన్ని పాత బస్టాండులో కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగగిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డిలు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయన మరెందరికో ప్రజాసేవ చేయాలని వారు ఆకాంక్షించారు.ప్రతి నిత్యం షెడ్యూలు ప్రకటించి దాని ప్రకారంగా వేములవాడ నియోజకవర్గంలో ప్రజల మధ్యల తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం కోసం కృషి చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నా ప్రజా నాయకుడు ఆది శ్రీనన్న అని వాళ్ళు కొనియాడారు.సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా తన నియోజకవర్గం లాగా మహేందర్ రెడ్డి అన్నతో శ్రీనన్న కలిసి పనిచేస్తున్నారని వారు గుర్తు చేశారు.శ్రీనన్న చేస్తున్న పనులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీనన్నకు మంత్రి పదవిలో చోటు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అద్యక్షులు చెన్ని బాబు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సాహెబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి,పందిళ్ల లింగం, బండారి బాల్రెడ్డి,దండు శ్రీనివాస్,సిరిపురం మహేందర్, నంది కిషన్ ఎడ్ల రాజ్ కుమార్,లాల్ బాయి,తాజా మాజీ రవీందర్ గుప్తా,బుచ్చిలింగ్ సంతోష్ గౌడ్,గంట అంజా గౌడ్, మామిళ్ల కిషన్, శ్రీనివాస్ రెడ్డి,సాయి ప్రేమ్, అనిల్ నాయక్, బాలచందర్ నాయక్,కదిరే శ్రీనివాస్ గౌడ్,గుర్రపు రాములు,మొగుళ్ళ మధు యాదవ్, పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,గంట వెంకటేష్ గౌడ్,రామ్ సింగ్ నాయక్, నెమలికొండ సత్తయ్య, బాల్రాజ్ రమేశ్ గౌడ్, చెరుకు ఎల్లయ్య యాదవ్, మిర్యాలుకర్ చందు సోషల్ మీడియా ప్రతినిధి బిపేట రాజకుమార్, ఇలియాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.
