నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ న గర అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం అవసరమని 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల బకాయిల విడుదలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలు ప్రత్యేక చొరవ తీసుకోని నగర అభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ దండు నీతు కిరణ్ కోరారు. నగరంలోని 16, 20 డివిజన్ లలో రూ. 20 లక్షల మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ తో కలిసి నగర మేయర్ దండునీతు కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ గత కౌన్సిల్ సమావేశంలో విడుదల చేసిన జనరల్ ఫండ్ తో అన్ని డివిజన్ లలో 10లక్షల నిధులతో పనుల ప్రారంభోత్సవానికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే . తేనె సాయిబాబా మందిరం ముందు లైన్ లోని బ్యాంకు కాలనిలో 10 లక్షల జనరల్ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను, 16 డివిజన్ దుబ్బ లోని ఎం కే గార్డెన్ ముందు లైన్ లో ముందు లైన్ లో 10 లక్షల జనరల్ నిధులతో సీసీ రోడ్డు సిసి డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు న్యాలం రాజు, పంచరెడ్డి ప్రవళిక, డిప్యూటీ ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి , అసిస్టెంట్ ఇంజనీర్ పావని కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
