- పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలనీ పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పరిసరాలు పరిశుభ్రంగా లేనందున దోమలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. అన్ని హాస్టల్స్ స్కూల్స్ లో కిటికీలకు దోమ తెరలు పెట్టాలని, హాస్టల్స్ లో ఏఎన్ఎం లను నియమించాలని , ఫుడ్ పాయిజన్ ఘటనలు పునవృతం కాకుండా నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని తెలిపారు. స్థానిక వార్డెన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, రాత్రి వేళల్లో ర్యాగింగ్ జరగకుండా చూడాలని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు హాస్టల్స్ లను సందర్శించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తీక్, జిల్లా నాయకులు దేవిక,మనోజ్,రాహుల్, మారుపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
