- గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ లకోసం
- 2 నుంచి 12 వరకు పదోన్నతుల ప్రక్రియకు అదేశాలు
హైద్రాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ( గెజిటెడ్), స్కూల్ అసిస్టెంట్ లు గా పదోన్నతులు కల్పించడానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గాను ఆర్ జేడిలతో పాటు డిఎఓ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 2న ప్రారంభమయ్యే ప్రక్రియ 11 వరకు ముగించాలని ఉత్త పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేశారు. గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులకు మల్టీ జోన్ 1 లో 490 కి పైగా, మల్టీ జోన్ 2 లో 410 కి పైగా, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ లు (ఎల్ఎఫ్ఎల్) లు రాష్ట్ర వ్యాప్తంగా 640 కి పైగా స్కూల్ అసిస్టెంట్ లు 2320 కి పైగా ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది.
- పదోన్నతుల షెడ్యూల్ 2 నుంచి 12 వరకు…
ఖాళీలను వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. 3న సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల సమర్పణ చేయాల్సి ఉంటుంది. 4 న అభ్యంతరాల పరిష్కారం తుది జాబితా విడుదల చేస్తారు. 6న వెబ్ ఆప్షన్ల అమలు (హెడ్మాస్టర్ గ్రేడ్- 2) కోసం ఉంటుంది. 8న ఎస్ జీటల తుది జాబితా విడుదల చేస్తారు. 10న వెబ్ ఆప్షన్లు ఎస్ జిటిల కోసం అవకాశం కల్పించారు. 11న స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి ఆర్డర్లు ఇస్తారు. 12 ఎస్ జిటి పదోన్నతి ఆర్డర్లు (డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతితో) ఉత్తర్వులు జారీ చేస్తారు.
