28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మండపాలలో కొలువుదీరిన దుర్గా మాతలు

Must read

📰 Generate e-Paper Clip

  • గ్రామాల్లో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: దేవి శరన్నవరాత్రులను  పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు, రాచర్ల బొప్పాపూర్,రాచర్ల గొల్లపల్లి  గ్రామాలతో పాటు పలు గ్రామాలలో దుర్గామాత మండపాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. దుర్గామాత విగ్రహాలను నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా మహిళల కోలాటం నృత్యాలు, భజన నృత్యాలు , భజనలు చేస్తూ మండపాలకు తరలించారు. మండపాలలో ప్రతిష్టించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిరోజు బాలత్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దేవీ నవరాత్రులలో భాగంగా వివిధ గ్రామాలకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 9 రోజులు, 9 అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు.. అమ్మవారి పూజా కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు.

Goddess Durga seated in the mandapam

More articles

Latest article