బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని జప్తి జాన్కం పల్లి గ్రామానికి చెందిన చిన్నన్న అంజయ్య అనే వ్యక్తికి చెందిన మేక గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు బాధితుడు అంజయ్య తెలిపారు. గురువారం మధ్యాహ్నం తన మేకలను మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులోకి మేతకు తీసుకెళ్లగా బుధవారం రోజున వీచిన ఈదురు గాలులకు తెగిపడిన 11 కెవి విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తూ మేక కాలుకు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మేక విలువ సుమారు 14 వేల రూపాయలు ఉంటుందన్నారు. పంట పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభం పై నుండి 11 కెవి విద్యుత్ వైర్ ఈదురు గాలులకు తెగిపడి కింద పడి ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయక నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే మేక మృతి చెందిందని అన్నారు. మేకల కాపరులు చూసి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారని, లేకుంటే మరిన్ని మేకల, మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆరోపించారు.
