విద్యుదాఘాతంతో మేక మృతి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని జప్తి జాన్కం పల్లి గ్రామానికి చెందిన చిన్నన్న అంజయ్య అనే వ్యక్తికి చెందిన మేక గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు బాధితుడు అంజయ్య తెలిపారు. గురువారం మధ్యాహ్నం తన మేకలను మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులోకి మేతకు తీసుకెళ్లగా బుధవారం రోజున వీచిన ఈదురు గాలులకు తెగిపడిన 11 కెవి విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తూ మేక కాలుకు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మేక విలువ...