24.3 C
Hyderabad

ఘనంగా మిలాద్ – ఉన్ – నబీ

Must read

📰 Generate e-Paper Clip

– నగరంలో ముస్లింల భారీ ఊరేగింపు

– ఎంఐఎం ఆధ్వర్యంలో  షర్బత్ పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా నిజామాబాద్ నగరంలో ముస్లిం సోదరులు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో  నాయకులు షకీల్ అహ్మద్, మునావర్ ఆధ్వర్యంలో హైమదీ బజార్ లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద  షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా  మిలాద్ – ఉన్ – నబీ ఐక్యమత్యంతో కలిసిమెలిసి జరుపుకుంటామని.. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరారు. ఊరేగింపులో  అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, సహాబాజ్ హైమద్, కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article