రఘునాథ ఆలయ అభివృద్ధికి రూ. 20 కోట్లు ఇవ్వండి

శాసన సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ హైదరాబాద్, బతుకమ్మ  : తెలంగాణ శాసన సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం శాసనసభలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇందూర్ పట్టణంలో సుమారు వెయ్యి ఏళ్ల చరిత్ర గల శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థకు చేరిందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్న దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆల్వారు స్వామి ఖిల్లా జైల్లో బందీలుగా ఉండి తమ రచనలు, కవిత్వాల ద్వారా తెలంగాణ ప్రజలను...