29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నాందేడు మహారాష్ట్ర కు చెందిన కామ్రే పూజ తన ఐదుగురు పిల్లలని తీసుకొని బుధవారం నిజామాబాదుకు ఫంక్షన్ హాల్లో పని చేయడానికి వచ్చింది.  బుధవారం రాత్రి నాందేడ్ వెళ్లడానికి నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి ట్రైన్ దొరకనందున భోజనం చేసి 11 గంటలకు పిల్లలతో సహా ప్లాట్ఫారం నెంబర్ రెండు మీద పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి తన పెద్ద కూతురు హారతి (15)నిపించలేదు. వెంటనే చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభించలేదు. వెంటనే నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  రైల్వే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరికైనా ఎక్కడైనా కనిపించినచో వెంటనే రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి 8712658591నంబరుకు సమాచారం అందించాలని తెలిపారు.

More articles

Latest article