26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వధూవరులకు బుద్ధుడి గ్రంథం బహుకరణ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:విశ్వ మానవ కళ్యాణానికి “మైత్రి” అనే గొప్ప సందేశం తథాగతుడైన గౌతమ బుద్ధుడు ఇచ్చాడు. మైత్రికి మూలం ఒకరినొకరి మధ్య గనిష్ఠ విశ్వాసం ఉండాలని, ఆ విశ్వాసమే నిజమైన ప్రేమను పెంచుతుందని సిద్దార్థుడు నిర్వర్తించాడు. నూతన వధువు వరుల మధ్య నిజమైన మైత్రి కొనసాగాలని, వారి బావి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని అంబేడ్కర్ వాదులు ఆశీర్వదిస్తూ “బుద్ధుడు అయన ధమ్మం” అనే గొప్ప గ్రంథాన్ని భేటీగా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం వరుడు నరేందర్ (తిమ్మాపుర్), వధువు వైశాలి (పాలెం) ల మధ్య శుభ వివాహం జిల్లా  మోర్తాడ్ మండలం తిమ్మాపురం గ్రామ శివర్లోగల బి.ఆర్ ఫంక్షన్ హాల్లో హాల్లాదకరంగా జరిగింది. వధువు తండ్రి బోగిడి శంకర్ సీనియర్ టీచర్, ధర్మ సమాజ్ పార్టీ (డిఎస్పి) సానుభూతి పరుడు. ఈ గ్రంథం భేటీలో డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ, డిఎస్పి నేత ఉమేష్ మహారాజ్, తోట బావయ్య మహారాజ్, బషీరాబాద్ బాబురావు మహారాజ్, దళిత సంక్షేమ సంఘం నేత జాంభవ చమార్, అలిండియా అంబేడ్కర్ యువజన సంఘం యువనేత మామిడి రాజు, చెప్పాల రాజేశ్ మహారాజ్, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article