. . . నేరస్థులు 25 పాత కేసులలో నింధితులు
. . . సోత్తు రికవరి చేసిన పోలిసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో అగస్టు 1న క్రిష్ణ నగర్ గ్రామం పరిధిలో ఒ ఇంటిలొ జరిగిన చోరి కేసులో పోలీసులు తీగ లాగితే డోంక కదిలింది. ఈ కేసులో ఇద్ధరిని అరెస్టు చేసి సోత్తు రికవరి చేసినట్టు నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఎసిపీ కార్యాలయంలో ఎర్పుట చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపీ మాట్లాడుతు… ఈ నెల 1న క్రిష్ణ నగర్ లో తన ఇంటిలో చోరి విషయంపై యార్లగడ్డ అనురాధా అనే మహిళ ఇచ్చిన పిర్యాదులో భాగంగా శనివారం మాణిక్ బండార్( చెక్క) వద్ధ కోటగిరి మండలం సుంకిని గ్రామానికి చెందిన చాకలి రాజు అలియాస్ గౌరారం రాజు, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లికి చెందిన కర్నేలింగం ను అదుపులోకి తీసుకోని విచారించడంతో చోరి కేసు కోలిక్కి వచ్చింది. రెంజల్ మండలం దుపల్లి గ్రామానికి చెందిన పుధరి గణేష్ పరారీలో ఉన్నాడని ఎసిపి తెలిపారు. ఇద్ధరి నుంచి కోటగిరి, వర్ని, రాజన్న సిరిసిల్లా జిల్లా తంగేళ్ల పల్లి, నవిపేట్ , మాక్లూర్ పోలిస్ స్టేషన్ ల పరిధిలో 11 కేసులకు సంబందించిన 4.8 గ్రాముల బంగారు అభరాణాలు, రెండువాచ్ లు, ఒ మోబైల్ పోన్, 5 బైక్ లు, 50 వేల విలువైన రోల్డ్ గోల్డ్ అర్నమెంట్స్ మొత్తం రూ.7.50 లక్షల విలువైన సోత్తునురికవరి చేసినట్లు ఎసిపి తెలిపారు. చాకలి రాజుపై 13 చోరి కేసులు ఉన్నాయని, కర్నే లింగం పై 12 కేసులు ఉన్నాయని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి చోరిలను చేస్తున్నారని తెలిపారు. ఇట్టి కేసు చేధనకు నిజామాబాదు డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, ఎల్.రాజా వెంకట్ రెడ్డి, సిసిఎస్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ నాగేంద్ర చారి అధ్వర్యంలో సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ ,బి.శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, యం.రాజశేకర్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, పి.యస్ మాక్లూర్, కే. వినయ్ కుమార్ పి.యస్ న విపేట్ లు కలిసి వివిధ కోణాలలో పరిశోధించి చెదించారని వారిని సిపి అభినందించారు.
