నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నం రసాయన శాస్త్రంలో “పాలిమర్ మాట్రిక్స్ తో ఔషధాలను జతచేసి, వాటి జీవప్రక్రియలపై అధ్యయనం” అనే అంశంపై “ప్రొ. ఎస్.బి. పట్వారీ పర్యవేక్షణలో పరిశోధన చేసి, ఎస్.ఆర్.టి.ఎం. యూనివర్శిటీ, నాందేడ్ నుండి పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. కళాశాలలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల “స్టాఫ్ క్లబ్” ఆధ్వర్యంలో డాక్టర్ రంగరత్నంను ఘనంగా సన్మానించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరం కలిసి పని చేశామని, బోధనలో నిష్ణాతులని, బోధన్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన పరిపాలన అనుభవం గల సీనియర్ అధ్యాపకులైనప్పటికీ, క్రమం తప్పకుండా విద్యార్థులకు తరగతులు తీసుకుంటారని, త్వరలోనే ప్రిన్సిపాల్ గా పదోన్నతి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, పీఆర్.ఓ. డాక్టర్ దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, వివిధ విభాగం అధిపతులు,డాక్టర్ రంజిత, వినాయకుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ జయప్రసాద్, ఉమా కిరణ్, బాలమణి, రాహుల్, రమేష్ గౌడ్, అనసూయ, అధ్యాపకులు వేణుగోపాల్, ప్రతిభ, గంగాధర్, వెంకటరమణ, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయ భాస్కర్, తదితర కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
