జిజి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నంకు డాక్టరేట్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్  డాక్టర్ రంగరత్నం  రసాయన శాస్త్రంలో  "పాలిమర్ మాట్రిక్స్ తో ఔషధాలను  జతచేసి, వాటి జీవప్రక్రియలపై అధ్యయనం" అనే అంశంపై   "ప్రొ. ఎస్.బి. పట్వారీ పర్యవేక్షణలో  పరిశోధన చేసి, ఎస్.ఆర్.టి.ఎం. యూనివర్శిటీ, నాందేడ్ నుండి పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. కళాశాలలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల "స్టాఫ్ క్లబ్" ఆధ్వర్యంలో  డాక్టర్ రంగరత్నంను ఘనంగా సన్మానించడం  జరిగింది. కళాశాల ప్రిన్సిపల్...