ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలి
. . . ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎ.మహేష్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : డిగ్రీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి మంచి విద్యాలయాల్లో సీట్లు సంపాదించి, ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎ.మహేష్ అన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తృతీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి కమిటీ...