నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నగరంలోని చాతదవైష్ణవ సంఘం సుభాష్ నగర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశాలో ఇటీవల టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా మండలంలోని పీఎంపిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడారు. టీఎస్ఎంసీ దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అందరూ ప్రాక్టీస్ కూడా తమ తమ ప్రాక్టీస్ లో ప్రతమ చికిత్సలే చేస్తామని తెలిపారు. ప్రథమ చికిత్స చేసే వారిపై ఎవరన్నా టి.ఎస్.ఎం.సి వాళ్ళు దాడి చేస్తే వారిపై తిరగబెడతారని అన్నారు. పరిధి దాటి వైద్యం చేసిన వారిపై దాడులు చేస్తే వారికి సహకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా టీఎస్ ఎంసీ వాళ్లు తమపై ఏదైతే దాడులు చేస్తున్నారో దాని మానుకొని వారికి కావాల్సిన ఎవరైతే నకిలీ వైద్యులను పట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి వహీద్, కోశాధికారి పురుషోత్తం, జిల్లా సెక్రెటరీ రాములు, మురళి, నరసయ్య, జహ్రుల్లా ఇంతియాజ్, మహిపాల్, బాలకృష్ణ పాల్గొన్నారు.
