24 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి కాంగ్రెస్ లో జిలెటిన్ స్టిక్స్ కేసు చిచ్చు

Must read

📰 Generate e-Paper Clip

  • అక్రమంగా కేసులో ఇరికించారని పిసిసి జనరల్ సెక్రెటరీ సంచలన ఆరోపణలు
  • 70 ఏళ్ల కాంగ్రెస్ నేత కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు
  • తనవద్ద అక్రమాల చిట్టా ఉందని అవసరం వచ్చినపుడు బయట పెడతానంటున్న యువ నేత

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోలో ఇటీవల వెలుగుచూసిన అక్రమంగా పేలుడు పదార్థాల నిలువ వినియోగం కేసు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను బద్దలు కొట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఆదిపత్య పోరును బట్టబయలు చేసింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో సీనియర్,  జూనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేసింది. కామారెడ్డి పట్టణం లోని కేపిఆర్ కాలనీలో ఉన్న వెంచర్ లో శ్రీధర్ అనే వ్యాపారి చేపట్టిన ఇంటినిర్మాణం లో అడ్డుగా వచ్చిన బండరాళ్ళను తొలిగించేందుకు పేలుడు పదార్థాల వినియోగం కాంగ్రెస్ పార్టి మెడకు చుట్టుకున్నట్టయింది. యువనాయకుడు ఇటీవల పిసిసీ జనరల్ సెక్రెటరిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ గడ్డం చందుపై పోలిస్ లు కేసు నమోదు చేయడం రాత్రికిరాత్రే అరెస్టు చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ వ్యవహారం పిసీసీ వరకు వెళ్ళింది. పరస్పర పిర్యాదులతోపాటు సవాల్ లకు ప్రతి సవాల్ లకు వేదికైంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయం జిల్లా కేంద్రం చుట్టే తిరిగుతోందని స్పష్టమౌతుంది.

Gelatin sticks case rocks Kamareddy Congress

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిలిటిన్ స్టిక్స్ కేసులో గడ్డం చంద్రశేఖర్ కు ఈ నెల 10 న న్యాయస్థానం బెయిల్ మజూరు చేయడంతో నిజామాబాద్ జైలు నుండి విడుదల అయ్యారు. తన అరెస్టు పై శుక్రవారం గడ్డం చంద్రశేఖర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెలుడు పదార్థాల అక్రమ నిలువ వాడకంపై నమోదైన కేసు అంత కుట్రపూరితంగా జరిగిందని సంచలన వ్యాక్యలు చేశారు. ఈ కేసు పూర్వపరాలను వెల్లడించారు. తనకు ఒక్క ప్లాట్ లేని వెంచర్ లో తనపై నమోదు చేసిన కేసును ఉదాహరిస్తూ పోలిస్ లు స్టేషన్ కు రప్పించి సినిమా పక్కీలో బిచ్కుంద లో మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచి తెల్లవారుజామున నిజామాబాద్ సెంట్రల్ జైలు కు తరలించారని ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందని 70 సంవత్సరాల వయస్సు కలిగిన నేత, ఆయన తమ్ముడు, కొడుకు కలిసి తనను కావాలని కేసులో ఇరికించారని గడ్డం చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. గురువారం రాత్రి జైలు నుండి విడుదల అయిన తర్వాత గడ్డం చందు ఏకంగా కామారెడ్డి పట్టణంలో బల ప్రదర్శనకు దిగాడు. తన అనుచరల ద్వారా ఘన స్వాగతం పలికించడంతో పాటు తన వెంట క్యాడర్ ఉందని చెప్పకనే చెప్పాడు.  గడ్డం చంధు కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతున్నానని చాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమౌతుంది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన జిలిటిన్ స్టిక్స్ కేసులో కాంగ్రెస్ యువ నేత గడ్డం చందు పై కేసు నమోదు కావడం తొలుత కాషాయ పార్టి నేతలు ఒత్తిడి చేయించాడని ప్రచారం జరిగింది. రాత్రికి రాత్రే గడ్డం చంద్రశేఖర్ ను అరెస్టు చేయడం జైలుకు పంపడంతో ఆయన బెయిల్ పై వచ్చేవరకు కేసు పూర్వాపరాలు దానివెనుక  కుట్రదారుల విషయం బహిర్గతం కాలేదు. జైలు నుంచి విడుధల ఆనంతరం చందు మాత్రం ఏకంగా కాంగ్రెస్ పార్టి నేతపైనే ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఈ విషయంలో తనకు  పిసీసీ అండగా ఉందని తెలిపారు. తనపై వేటు వేస్తారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తనవద్ద అక్రమార్కుల అక్రమాల జాబితా చిట్టా ఉందని అవసరం వచ్చినపుడు ఖచ్చితంగా బయట పెడతానని చేసిన వ్యాక్యాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎకచాత్రాదిపత్యంగా సాగుతున్న పార్టి వ్యవహారాల్లో గ్రూపు రాజకీయాలు ఈ ఉదంతంతో  బట్టబయలు అయ్యాయి.  యువ నేత వర్సేస్ సినియర్ నేత వ్యవహరం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని చర్చ మొదలైంది.

Gelatin sticks case rocks Kamareddy Congress

More articles

Latest article