27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్ల పక్కనే చెత్తాచెదారం..

Must read

📰 Generate e-Paper Clip

  • తొలగించిన నాయకుడు గౌస్ పాషా

 

బతుకమ్మ, బాన్సువాడ : పారిశుధ్య నిర్వహణ లోపంతో పట్టణ ప్రజానీకం ఇక్కట్లు తీవ్రమవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో రోడ్ల పక్కనే చెత్తాచెదారం డంప్ చేస్తుండడంతో అక్కడ మినీ డంపింగ్ యార్డ్లు దర్శనమిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించకుండా చేస్తున్నామని అధికారులు గొప్పలకు పోతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది. తమ కాలోనీ ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు గౌస్ పాషా ముందుకు వచ్చి చొరవ తీసుకొని చెత్తను తొలగించారు. టీచర్ కాలనీలో ఉన్న ఎల్లయ్య చేరువు రోడ్డు పక్కనే చెత్తాచెదారం పేరుకుపోవడంతో ఆ ప్రాంతం అంతా దుర్గందం వ్యాపించింది. పాదాచారులు, వాహనదారులు ఆవైపు వెళ్లడానికి కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దుర్గంధం తట్టుకోలేని స్థానికులు ఈ సమాచారాన్ని గౌస్ పాషా చేరవేశారు. వెంటనే కాలనీ వాసులకు స్పందించిన గౌస్ పాషా మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకెళ్లి టాక్టర్ డోజర్ సహాయంతో చెత్తను తొలగించారు.

Garbage strewn along the roads..

More articles

Latest article