26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసుల భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

–నేడు మిలాన్ ఊన్ నబి ఉన్నందున
–భారీగా పోలీసుల మోహరింపు
–అల్లర్లు సృష్టిస్తే కేసులు తప్పవు ఎస్సై మనోజ్ కుమార్
ఇందల్వాయి,బతుకమ్మ : మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గణనాథుని నిమజ్జనోత్సహానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ముస్లిం సోదరుల నేడు మిలన్ ఊన్ నబీ పండగ ఉన్నందున ఎలాంటి ఘటనలు సృష్టించిన వారిపైన కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. గ్రామంలో గణనాధుని నిమజ్జనం మహోత్సవవాన్ని శాంతియుతంగా జరుపుకొని, ఎలాంటి అల్లర్లు సృష్టించవద్దని గొడవలకు తావివ్వొద్దని కోరారు. దీనికి గ్రామస్తులు ముస్లిం సోదరులు సహకరించాలని సూచించారు. పండగ అనేది అందరికీ స్వేచ్ఛనిస్తుందని దీనిని అందరూ పాటించాలని కోరారు. లేనిపక్షంలో సిపి ఆదేశాల ప్రకారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సహించేది లేదన్నారు. గణనాథుల ముందు డిజె సౌండ్ వాడొద్దని చెప్పిన కొన్ని మండపాల వారు డిజె సౌండ్ వాడుతున్నారని వాటిని సిజ్ చేసి పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article