26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మునిపల్లి గ్రామ అభివృద్ధికి రూ.2.29కోట్ల నిధులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

  • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

జక్రాన్‌పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తెలంగాణ మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  మాట్లాడుతూ…గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల 29 లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు. మునిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2400గా నిర్ణయించిందని, ఈ కేంద్రాల ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, సంఘ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • మొబైల్ ఫిష్ వ్యాన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే..

ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగంగా మొబైల్ ఫిష్ వ్యాన్ ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నగరంలోని గుపన్ పల్లి బైపాస్ రోడ్డులో గల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి, దుబ్బాక గంగమని పేరును డీ ఆర్ డీ ఓ ద్వారా పంపించిందని తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.సంచార చేపల విక్రయ వాహనం రూ.6 లక్షల సబ్సిడీతో 4 శాతం వడ్డీతో సంఘం నుండి రుణం అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. వివిధ రకాల చేపల ఆధారంగా స్నాక్స్ ఐటమ్స్ తయారీపై శిక్షణ కూడా ఇవ్వబడిందని చెప్పారు. చేపల ఆధారిత ఉత్పత్తుల విక్రయం ద్వారా మహిళలకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు రమేష్, శ్రీనివాస్, కుమార్ రెడ్డి, డీ ఆర్ డీ ఏ సిబ్బంది, ఇందిరా మహిళా శక్తి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Funds of Rs. 2.29 crore sanctioned for the development of Munipalli village

More articles

Latest article