జిల్లా రైతులకు ప్రతి పంటపై అవగాహన ఉంది
హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూరు నుంచే పునాది
రోహింగ్యాలకు అడ్డాగా మారిన బోధన్
రేవంత్, కవితలు ఒక కంపెనీకి డైరెక్టర్లు
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే
ఇందూరు పసుపు” తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో ఎంపీ అర్వింద్
నిజామాబాద్, బతుకమ్మ : వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్రం ప్రభుత్వం లక్ష కోట్ల నిధులు ఇస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో సోమవారం “ఇందూరు పసుపు” తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని అన్నారు. బోధన్ రోహింగ్యాలకు అడ్డాగా మారిందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదు అనేవాళ్లను చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యనించారు. హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూరు నుంచే పునాది కావాలన్నారు. జిల్లాలో ప్రగతిశీల రైతులున్నారని, వారికి ప్రతి పంటపై అవగాహన ఉందన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే సబ్సిడీ లు అందజేస్తామన్నారు. కో ఆపరేటివ్ సెక్టార్ లో ఏర్పడే పరిశ్రమలకు ఇందూరు ప్రాంతం ఎంతో అనుకూలమన్నారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులను వెంటనే పంపించేయాలన్నారు. ప్రధాని మోదీ మనదేశానికి జగద్గురులా ఉన్నాడన్నారు. రేవంత్, కవితలు ఒక కంపెనీకి డైరెక్టర్లగా ఉన్నారని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్ లో బీజేపీకి 70 శాతం ఓట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈకార్య క్రమంలో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, రాకేశ్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


