జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
రామన్నపేటలో ఉపాధి కూలీలతో సమావేశం
బాల్కొండ, బతుకమ్మ : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో,లేవో అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకే చేరే విధంగా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో వేల్పూర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, వేల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షులు రమణ, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భూమా రెడ్డి ,బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆత్మరామ్ , అక్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు మల్లారెడ్డి , రామన్నపేట్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చిన్నయ్య,మోహన్, నితీష్, శోభన్, సృజన్, శ్రీను,మహేష్, గణేష్, కిషన్, హరీష్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
