28.2 C
Hyderabad

విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ ఎంపియుపిఎస్ పాఠశాలలో శనివారం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన దాతలు గ్రామ సర్పంచ్ నందిగామ సుమలత కృష్ణ రూ.5 వేలు, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం రూ.5 వేలు, కుర్మాజి స్వామి రూ.2 వేలు విరాళంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్పోర్ట్స్ టీ షర్ట్స్, షూస్, స్కూల్ బ్యాగ్స్, ఏకరూప దుస్తువులను ఉచితంగా అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దాతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడిసి అధ్యక్షులు పట్ల సురేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article