24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉచిత ఆరోగ్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్ఎన్ఎస్పీఏలో భాగంగా వినాయక్ నగర్ యుపిఎస్సి నందు సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ అంజన ప్రారంభించారు. ఇందులో మొత్తం 160 మందికి వైద్య సేవలు అందించారు. 46 మంది మహిళలకు గైనకాలజిస్టు సేవలందించారు. 39 మంది కంటి జబ్బులు గల వారికి ముగ్గురు మానసిక వ్యాధిగ్రస్తులకు, 72 మంది ఇతర వ్యాధులు ఉన్నవారికి చికిత్స అందించారు. 80 రక్త పరీక్షలు నిర్వహించారు. 76 మంది కి క్షయ వ్యాధి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. 123 మందికి హెచ్.పీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తుకారాం రాథోడ్, మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ రవితేజ, డాక్టర్ శ్రీజ, హెచ్ ఓ వెంకట రవి, పిహెచ్ఎన్ సుకన్య, సిఈఓ ఆనంద్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

Free health camp

More articles

Latest article