29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ధీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ ధీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తూ ఉచిత వసతి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డీడీయూ జీకేవై నిజామాబాద్ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. 4 నెలల కాల వ్యవధి కలిగిన డొమెస్టిక్ ఐటి హెల్ప్ డెస్క్ అటెండెట్ తో పాటు బేసిక్ కంప్యూటర్, డాట ఎంట్రీ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు యువతి, యువకులు పదవ తరగతి పాసై ఉండాలని సూచించారు. ఆసక్తి కలిగిన యువతి, యువకులకు ఈ నెల 20న నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎస్.వి.డిగ్రీ కళాశాలలో జరిగే కౌన్సిలింగ్ కు ఎస్సెస్సీ మెమో, ఇంటర్, కులం, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్ బుక్, 4 పాస్ పోర్టు సైజ్ ఫోటోలతో హాజరుకావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గ్రామీణ యువతి, యువకులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. మరిన్ని వివరాలకు ఎస్వీ డిగ్రీ కాలేజిలో సంప్రదించాలని, సెల్. నంబర్ 9014569553, 6309785035, 7702963287 నంబర్లకు సంప్రదించాలన్నారు.

More articles

Latest article