తాడ్కోల్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు మాయం

0 14,859

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మండలం తాడ్కోల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు మయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టోర్ రూమ్ లో ఉన్న పది కంప్యూటర్లలో ఐదు కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వగా ఒక కంప్యూటర్ ఆఫీస్ నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. మిగతా నాలుగు కంప్యూటర్లు ఈనెల 22న కనిపించకుండా పోయాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ కంప్యూటర్లు ఉన్న స్టోర్ రూమ్ తాళాలు ఆఫీస్ రూంలో ఉంటాయి.వేసిన తాళం వేసినట్లే ఉంది కానీ నాలుగు కంప్యూటర్లు లేవు ఇదే విషయంపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.కంప్యూటర్లు మాయం అవ్వడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు దొంగతనం జరిగిందా లేదా లేక ఇంటి దొంగల పనైనా అనే కోణంలో పోలీసులు సైతం విచారణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.