తాడ్కోల్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు మాయం

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మండలం తాడ్కోల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు మయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టోర్ రూమ్ లో ఉన్న పది కంప్యూటర్లలో ఐదు కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వగా ఒక కంప్యూటర్ ఆఫీస్ నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు. మిగతా నాలుగు కంప్యూటర్లు ఈనెల 22న కనిపించకుండా పోయాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ కంప్యూటర్లు ఉన్న స్టోర్ రూమ్ తాళాలు ఆఫీస్...